Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లేడీస్ హాస్టల్లోని అమ్మాయిని హత్య చేసిందెవరు?: ‘గీత సాక్షిగా’ ట్రైల‌ర్‌ రిలీజ్!

Geeta Sakshiga Trailer Released
Advertisement
  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే 'గీత సాక్షిగా'
  • కథానాయికగా చరిష్మా పరిచయం 
  • సంగీతాన్ని అందించిన గోపీసుందర్ 
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల
Advertisement
యధార్థ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. చేతన్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకి ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించాడు. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. మంగ‌ళ‌వారం ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచుతూ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. 

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే .. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌శ్నించేలా ఉంది. లేడీస్ హాస్టల్ లో జరిగిన ఓ మ‌ర్డ‌ర్ కేసులో హీరో ఇరుక్కోవడం అత‌నికి శిక్ష విధించాలంటూ మ‌హిళా సంఘాలు పోరాటం చేసే స‌న్నివేశాల‌తో పాటు.. చేయ‌ని త‌ప్పుకు అన్యాయంగా కేసులో ఇరుక్కున్న హీరో ఆద‌ర్శ్ తిర‌గ‌బ‌డే స‌న్నివేశాలు చూడొచ్చు. హీరో ఆద‌ర్శ్ లుక్, స్టైల్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. మార్చి 22న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో 'చ‌రిష్మా' కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా క‌థాంశం తిరుగుతుంటుందని మేకర్స్ తెలియ‌జేశారు. 

ఇంకా ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్‌, రూపేష్ శెట్టి, భ‌ర‌ణి శంక‌ర్‌, జ‌య‌ల‌లిత‌, అనితా చౌద‌రి, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వెంక‌ట్ హ‌నుమ‌ నారిశెట్టి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి,  కిషోర్ మ‌ద్దాలి ఎడిట‌ర్‌. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. పృథ్వీ ఫైట్స్ .. యశ్వంత్ - అనీష్ కొరియోగ్రఫీ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. 
Advertisement
Advertisement
Adarsh
Chitra Shukla
Geeta Sakshiga Movie

More Telugu News